Peddi: పెద్ది మూవీ షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్
గేమ్ ఛేంజర్(game changer) సినిమాతో డిజాస్టర్ ను అందుకున్న రామ్ చరణ్(ram charan) ప్రస్తుతం బుచ్చిబాబు సాన(buchibabu sana) దర్శకత్వంలో పెద్ది(peddi) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సినిమా మొదలవక ముందే బుచ్చిబాబు అన్నీ సరిగ్గా ప్లాన్ చేసుకోవడంతో ఎలాంటి బ్రేకుల్లేకుండా షూటింగ్ శరవేగంగా పూర్తైపోతుంది.
ప్రస్తుతం పెద్దికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లోని ఓ రైల్వే స్టేషన్ లో జరుగుతుంది. రైల్వే స్టేషన్ లో షూటింగ్ అయిపోయాకి పెద్ది టీమ్ ఓ కీలక షెడ్యూల్ కోసం నాసిక్(Nashik) వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో సినిమాలోని ఎన్నో కీలక సీన్స్ ను షూట్ చేయనున్నారట. ఆ తర్వాత సినిమాలోని కీలకమైన క్లైమాక్స్ తో పాటూ క్రికెట్ ఆధారంగా రాబోయే సీన్స్ ను కూడా బుచ్చిబాబు త్వరలోనే షూట్ చేయనున్నట్టు సమాచారం.
ఎట్టి పరిస్థితుల్లో సినిమా షూటింగ్ ను అక్టోబర్ నాటికి పూర్తి చేసి ఆ తర్వాత కొంచెం ఫ్రీ గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను పూర్తి చేయాలని బుచ్చిబాబు అనుకుంటున్నాడట. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్(janhvi kapoor) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శివ రాజ్ కుమార్(sivaraj kumar), జగపతి బాబు(jagapathi babu) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏ ఆర్ రెహమాన్(AR Rahman) సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.













