శాంతి-భద్రత-సోదరభావం-పరమత సహనమే క్రీస్తు మార్గము : సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి : ఈస్టర్ పర్వదినం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లోని క్రైస్తవ సోదరులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు – ఏసుక్రీస్తు మానవత్వాన్ని, శాంతియుత సహజీవనాన్ని చాటిచెప్పారు – సమాజానికి ‘శాంతి-సమాధానం’ జీసెస్ ఇచ్చారు – శాంతి-భద్రత-సోదరభావం-పరమత సహనమే క్రీస్తు మార్గము – క్రీస్తు బోధనలే మార్గదర్శకం, అనుసరణీయము – గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో మత సామరస్యం, శాంతియుత సహజీవనం కోసం కృషి చేశాము – క్రైస్తవ సోదరుల సంక్షేమానికి వినూత్న సంక్షేమ పథకాలు తెచ్చాము : సీఎం చంద్రబాబు నాయుడు.













