సంక్షేమ రాజ్యం కాదు.. ఇది సంక్షోభ రాజ్యం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీదీ సంక్షేమ రాజ్యం కాదని, ఇది సంక్షోభ రాజ్యమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాలు మొత్తం బడ్జెట్లో 50 శాతానికి మించి సంక్షేమం మీద ఖర్చు పెట్టేవన్నారు. 1975లోనే స్వర్గీయ ఇందిరా గాంధీ సంక్షేమ కార్యక్రమాలతో 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం ప్రారంభించిందన్నారు. 2014`15లో 53 శాతం సంక్షేమం మీదే ఖర్చు పెట్టడం జరిగిందన్నారు. వైసీపీ పాలనలో 2019`20లో 39 శాతం 2020`21లో 41 శాతం మాత్రమే సంక్షేమ మీద ఖర్చు పెట్టడం జరిగిందని పేర్కొన్నారు.













