అది జగన్కు భజన సభ.. విజయమ్మ వీడ్కోలు
వైసీపీ ప్లీనరీ సభను ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు భజన సభ, విజయమ్మ వీడ్కోలు సభ అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలలో 95 శాతం అమలు చేశామని ప్లీనరీలో జగన్ చెప్పడం పచ్చి అబద్ధమని అన్నారు. బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నట్లున్నాయ్ జగన్ వ్యాఖ్యలు అని మండిపడ్డారు. వాస్తవంగా 95 శాతం అమలు చేయలేదని, రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమిని ఎవ్వరూ ఆపలేరని స్పష్టం చేశారు. వైసీపీ చివరి ప్లీనరీ సభగా చెప్పవచ్చన్నారు. తల్లిని అవమానపరిచిన తనయుడిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. వైసీపీ గౌరవాధ్యక్ష పదవి నుంచి అగౌరవంగా తొలగించారని తెలిపారు. ఇప్పటికైనా జగన్ భజన బృందానికి కనువిప్పు కలగాలన్నారు.













