కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే.. ఏపీకి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి త్రప్యేక హోదా వస్తుందని పీసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవినీ, ప్రాణ వాయువని అన్నారు. ప్రత్యేక హోదా వలన రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. 2014 లో గానీ, 2019లో గానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వుంటే ఈ పాటికి ప్రత్యేక హోదా అమలై ఉండేదన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నంత వరకు ఏపీకి ప్రత్యేక హోదా రాదని అన్నారు. ప్రాంతీయ పార్టీలైనా టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలకు ఇచ్చే శక్తి, తెచ్చే శక్తి లేదని విమర్శించారు. కాబట్టి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దుష్ట చతుష్టయ పార్టీలైన బీజేపీ, టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలను ఓడిరచి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే ప్రత్యేక హోదా వస్తుందని అన్నారు.













