ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగించాలి
ప్రజా సమస్యలపై పోరాట పంథా వీడొద్దని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారని ఆ పార్టీ సీనియర్‌నేత పయ్యావుల కేశవ్ తెలిపారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రాహ్మణి, పయ్యావుల కేశవ్‌ల ములాఖత్ ముగిసింది. ఆనంతరం జైలు వద్ద పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత మాలో ధైర్యం వచ్చింది. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పారు. ప్రజలు, పార్టీ నేతలు ఏవిధంగా ఉన్నారనే ఆవేదన చంద్రబాబులో ఉంది. సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని తెలిపారు. రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టును జగన్ ముందుకు తీసుకెళ్లనీయలేదన్నారు. ప్రాజెక్టులు చేపట్టట్లేదని సమరభేరి ఎంచుకుని చంద్రబాబు ప్రజల్లోకి వచ్చారు. చంద్రబాబు పోరాటంతో ప్రజల్లో స్పందన చూసి ప్రభుత్వం భయపడి ఆయన్ను ఆరెస్టు చేసింది అని అన్నారు.













