ఆ అంశంపై చర్చించి సమాధానం ఇచ్చేందుకు… ప్రభుత్వం సిద్ధంగా ఉంది
ఇండియా కూటమితో పొత్తు కోసమే వైసీపీ అధ్యక్షుడు జగన్ ఢిల్లీ వెళ్లినట్లు ఉందని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. శాసనసభ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ నుంచి అమరావతికి వచ్చిన జగన్ అసెంబ్లీకి రావాలి. ఆయన చెబుతున్న రాజకీయ హత్యల వివరాలు సభలో పెట్టాలి. ఆ అంశంపై చర్చించి సమాధానం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఢిల్లీ రోడ్లపై ఏపీలో శాంతిభద్రతల గురించి గగ్గోలు పెట్టడం దేనికి? రాష్ట్రంలో శాంతిభద్రతల వైపల్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి. ఇవాళే ఆ అంశంపై శ్వేతపత్రం విడుదల చేస్తున్నాం అని తెలిపారు.













