కేంద్ర ప్రభుత్వ సంస్థలచే.. ఆడిట్ కు సిద్ధమా? : పయ్యావుల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమాజానికి హానికరమైన వ్యక్తులపై పెట్టాల్సిన నిఘా తెలుగుదేశం పార్టీ నాయకులపై నిరర్ధకంగా కొనసాగిస్తున్నాని పీఏసీ చైర్మన్, టీడీపీ ఎమ్యెల్యే పయ్యావలు కేశవ్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెగాసెస్ ఇక్యూప్‌మెంట్ కొన్నారని అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. పెగాసెస్ ఇక్యూప్‌మెంట్ చంద్రబాబు కొనలేదని గౌతమ్ సవాంగ్ ఆర్టీఐ సమాధానం ఇచ్చారని, కేవలం అసత్య ప్రచారాలు, అభూత కల్పనలతో ప్రజల్ని నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రాజకీయ నేతలు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, సాక్షి పత్రిక ఉద్యోగులపై కూడా నిఘా పెట్టడం నిజం కాదా అని ప్రశ్నించారు. పెగాసస్ వ్యవహారంలో వైసీపీది బోగస్ ప్రచారమని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ఎవరెవరిపై నిఘా పెట్టారనేదానిపై ఆడిట్‌కు సిద్ధమా అని సవాల్ విసిరారు.
మంత్రులు, ఎమ్మెల్యేలతో ఆరోపణలు చేయించడం కాదని, రాతపూర్వకంగా సమాధానం ఇవ్వగలరా అని ప్రశ్నించారు. పెగాసన్ విషయంలో అవాస్తవాలతో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం అసత్య ప్రచారాలు, అభూత కల్పనలతో ప్రజల్ని నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. పెగాసస్‌పై శాసనసభ కమిటీ వేసి చర్చ నిర్వహించడం వృథా ప్రయాసే అయిందని ఎద్దేవా చేశారు. ఇదంతా వైసీపీ ప్రభుత్వ అభద్రతా భావానికి నిదర్శనమని అన్నారు.













