వచ్చే ఎన్నికల తర్వాత.. వైఎస్ జగన్ కు చుక్కలు
కుప్పంలో వైసీపీ శ్రేణులు అన్న క్యాంటీన్ ధ్వంసం చేయడం దుర్మార్గమని టీడీపీ నేత, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనను అడ్డుకునే కుట్రలు సిగ్గుచేటన్నారు. అసలు జగన్ రెడ్డికి సిగ్గుందా? అని ప్రశ్నించారు. పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్ కూలుస్తారా? అని ప్రశ్నించారు. కుప్పంలో వైసీపీ నేతలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తపై చెయ్యి ఎత్తిన ఏ ఒక్కడినీ వదిలేది లేదని మరోసారి స్పష్టం చేశారు. టీడీపీ కార్యకర్త వంటి నుంచి కారిన ప్రతి రక్తపు చుక్కా రేపు చురకత్తి కాబోతోందని అన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత వైఎస్ జగన్కు చుక్కలు చూపించడం ఖాయమన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త తిరగబడితే ఎలా ఉంటుందో చూపిస్తామని అన్నారు.













