దేశంలో ఏ గుడిలోలేని ఆంక్షలు.. తిరుమలలోనే ఎందుకు?
దేశంలో ఏ గుడిలో లేని కరోనా ఆంక్షలు తిరుమలలోనే ఎందుకు? అని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపించారు. టీటీడీ నిర్ణయాలపై పయ్యావుల స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి భక్తుల మనోభావాలకు విరుద్ధంగా టీటీడీ నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. భక్తులను శ్రీవారికి దూరం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా టీటీడీ బోర్డు నిర్ణయాలు ఉన్నాయన్నారు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలను వ్యాపార కేంద్రంగా చేస్తున్నారు. టికెట్ లేకుంటే తిరుపతి నుంచి తిరుమలకూ పంపడం లేదన్నారు. తిరుమలలో కరోనా ఆంక్షలపై బీజేపీ ఎందుకు మౌనంగా ఉందన్నారు.
తిరుమల శ్రీవారు ఉన్న చోట మరో ఆధ్మాత్మిక సిటీ ఎందుకు? అని ప్రశ్నించారు. రూ.వెయ్యి కోట్లతో దేశ వ్యాప్తంగా అనేక అలయాలు కట్టవచ్చు అన్నారు. తిరుమల భద్రతపై కమిటీ నివేదికను తుంగలో తొక్కుతున్నారు. స్వామివారి ఆలయ వాస్తును దెబ్బతీసేలా టీటీడీ నిర్ణయాలు ఉన్నాయి. తిరుమలలో టికెట్ల ధర పెంచుతుంటే ప్రభుత్వం స్పందించదా? అని ప్రశ్నించారు. క్రిమినల్ కేసులు ఉన్న 16 మందిని టీటీడీ సభ్యులుగా నియించారు శ్రీవారి సేవా టికెట్లను టీటీడీ సభ్యులే వాటాలు వేసుకుంటున్నారు. వసతి, ప్రసాదం ధర పెంచడం సామాన్య భక్తులపై పెనుభారం పడిరదని ఆరోపించారు.













