కొత్త పెట్టుబడులు రాక .. 20 ఏళ్లు వెనక్కి
కొత్త పెట్టుబడులు రాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్థిక పరిస్థితిపై మంత్రి పొంతన లేని ప్రకటనలు విడుదల చేస్తున్నారని విమర్శించారు. మూలధన వ్యయం ఎంత, రాష్ట్ర ఆదాయం ఎంత స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పథకాలకు ఖర్చు చేసే మొత్తం కంటే ప్రకటనలకు వెచ్చించిందే ఎక్కువని ఆరోపించారు. ఆదాయం బాగున్నప్పుడు పొరుగు రాష్ట్రాల మాదిరి ఎందుకు జీతాల్లేవేంటని నిలదీశారు. మరో తరం పాటు రాష్ట్రానికి కోలుకోలేని విధంగా దెబ్బతీశారని అన్నారు. శాఖల వారీగా ఎంత ఖర్చు చేశారో చెప్పే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. ఎఫ్ఆర్బీఎం పరిధి కంటే రెండు రెట్లు ఎక్కువ అప్పులు చేశారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి ఏ బ్యాంకు అప్పు ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు.













