ఆ రెండు సంస్థలూ ఒక్కటే.. కాదని మీరు నిరూపించగలరా? : పయ్యావుల
సీమెన్స్ ఇండస్ట్రియల్ సాఫ్ట్వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కి, సీమెన్స్‌కి సంబంధం లేదని నిరూపించగలరా? అని ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ సంజయ్‌కు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ సవాల్ విసిరారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆ రెండు సంస్థలూ ఒక్కటే అని నేను నిరూపిస్తా, కాదని మీరు నిరూపించగలరా? అని ప్రశ్నించారు. జర్మనీకి చెందిన సీమెన్స్ ఒక్కో దేవంలో ఒక్కో పేరుతో సేవలు అందిస్తోందన్నారు. యూకే, యూఎస్, నెదర్లాండ్స్ ఇండియాలో ప్రారంభించారు. 1997లోనే ఈ సంస్థ కార్యకలాపాలు మొదలయ్యాయి. ఈ కేసులో సీమెన్స్‌కు సంబంధం లేదంటే ఎలా వదిలేస్తారు? సీమెన్స్ ఏజీ మాకు సంబంధం లేదని రాసిన లేఖను సీఐడీ విడుదల చేయాలి. ఈ ప్రాజెక్టుతో మాకు సంబంధం లేదని వారు చెప్పారా? అని ప్రశ్నించారు.
సీమెన్స్ ఏపీ బడ్జెట్ కంటే ఆరురెట్లు ఎక్కువ నిధులతో వ్యాపారం చేస్తోంది. ఏపీలో ఏదో జరిగిపోయిందని హైదరాబాద్‌కు వచ్చి మరీ మీడియా సమావేశాలు పెట్టి చెబుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ గురించి అసలు మీకు ఏ తెలుసు? ఇంటర్, డిగ్రీ, బీటెక్ యువతకు శిక్షణ ఇచ్చారు. నేడు తెలుగు యువత ప్రపంచదేశాల్లో ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు. సీమెన్స్ మనదేశంలోని ఆరు రాష్ట్రాల్లో సేవలందిస్తోంది. సీమెన్స్‌పై కట్టు కథలు అల్లి విష ప్రచారం చేశారు. నిరుద్యోగ యువత జీవితాల్లో నిప్పులు పోశారు. అబద్దాలు ప్రచారం చేయడంలో వైసీపీ అరితేరారు. కోర్టులకు కూడా అసత్యాలు చెబతున్నారు అని అన్నారు.













