వెకేషన్ నుంచి రియాల్టీ లోకి వచ్చి.. పోలింగ్ సమరానికి సిద్ధమవుతున్న కూటమి నేతలు..
ఆంధ్రాలో ఎన్నికల సమయంలో ప్రచారం అంటూ ఎంతో హడావిడిగా తిరిగిన నేతలు పోలింగ్ ముగిసిన తర్వాత వెకేషన్‌కు వెళ్ళిపోయారు. చాలామంది విదేశాలకు కుటుంబ సమేతంగా వెళ్లి సేద తీరారు. టీడీపీ అధినేత చంద్రబాబు మే 19 నుంచి 28 వరకు అమెరికా టూర్ లో ఉన్నారు. అమెరికాలో వైద్య చికిత్స కోసం ఆయన వెళ్లారు అని టీడీపీ శ్రేణులు చెబుతున్నప్పటికీ వైసీపీ నేతలు మాత్రం పలు దేశాలలో ఆయన పర్యటించారు అని అంటున్నారు. ఏదేమైనాప్పటికీ చంద్రబాబు 29న హైదరాబాదులోని తన ఇంటికి చేరుకున్నారు.
ఈరోజు నుంచి ఉండవల్లి లోని తన నివాసంలో చంద్రబాబు ఉంటారు. అక్కడ నుంచి మంగళగిరిలోని పార్టీ కేంద్రాలయం ని కూడా పర్యవేక్షిస్తారు.. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేటంతవరకు చంద్రబాబు ఉండవల్లి నివాసంలోనే ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటు జనసేనాని వెకేషన్ కూడా పూర్తయినట్లు సమాచారం. ఈనెల 31న ఉండవల్లిలో పోలింగ్ సరళి పై చర్చించడం కోసం చంద్రబాబుతో పవన్ భేటీ కాబోతున్నారు.
గ్రౌండ్ లెవెల్ నుంచి ఎన్నికల పోలింగ్ సరళి పై తెప్పించుకున్న పూర్తి సమాచారాన్ని ఇరువురు నేతలు లోతుగా అధ్యయనం చేయబోతున్నట్లు తెలుస్తోంది.. ఈసారి తమ గెలుపు కన్ఫామ్ అని పసుపుదళం కాన్ఫిడెన్స్ తో ఉంటే.. వారు వన్ సైడ్ అంటున్నాయి వైసీపీ శ్రేణులు. జూన్ 4 కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి ఫలితాలు వెలబడేటంతవరకు నేతలు సమన్వయం పాటించాలని ఇరు పార్టీల నాయకులు సూచనలు జారీ చేశారు.
చంద్రబాబు నివాసంలో పవన్‌తో జరిపే చర్చలలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కూడా పాల్గొంటారు అని టాక్. పోలింగ్ రోజు కూటమిలో భాగమైన మూడు పార్టీల మధ్య పూర్తి కోఆర్డినేషన్ ఉంటే ఇలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడ ఈ చిన్న పొరపాటుకి ఆస్కారం ఇవ్వకుండా ప్రతి ఒక్క ఓటు లెక్కించే విధంగా చూడాలి అని ఈ భేటీలో నిర్ణయం తీసుకుంటార. చాలా రోజుల తర్వాత చంద్రబాబు, పవన్ భేటీ అవుతున్న నేపథ్యంలో.. ఎన్నికల్లో తమకు ఎన్ని సీట్లు వస్తాయి అన్న విషయంపై ఏదైనా క్లూ ఇస్తారేమో అని అందరూ ఆశిస్తున్నారు.













