పిఠాపురం ను స్వస్థలంగా మార్చుకుంటానన్న పవన్ కళ్యాణ్
జరగబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గాన్ని తన స్వస్థలంగా మార్చుకోవడానికి పవన్ ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. కాకినాడ జిల్లాలోని గొల్లప్రోలు మండలం కు చెందిన చేబ్రోలు గ్రామంలో ఓదూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ నివసించబోయే భవన నిర్మాణం సాగుతోంది. పవన్ నిర్వహిస్తున్న వారాహి విజయభేరి యాత్రలో భాగంగా అనకాపల్లిలో 7 వ తారీఖున ఎలమంచిలి లో 8న పర్యటనలు ఉంటాయి. ఏప్రిల్ 9 ఉగాది పండుగను పురస్కరించుకొని పిఠాపురం నియోజకవర్గంలో జరిగే వేడుకలలో పవన్ పాల్గొనబోతున్నారు. జ్వరం కారణంగా రెండు రోజులు ప్రచారానికి విరామం తీసుకున్న పవన్ ఆదివారం నుంచి యధావిధిగా తన ప్రచారం మొదలు పెడతారట. ప్రస్తుతం పవన్ నివాసానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. త్వరలోనే పవన్ పిఠాపురంలో నివాసం ఉండబోతున్నారు.













