పిఠాపురం నుంచి పోరుకు సిద్ధం..క్లారిటీ ఇచ్చిన జనసేనాని..
చాలా కాలం ఎదురుచూపుల తర్వాత పవన్ కళ్యాణ్ తాను పోటీ చేయబోయే స్థానాన్ని వెల్లడించి ఇప్పటివరకు నెలకొన్న ఉత్కంఠతకు తరలించారు. ఈరోజు జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ తాను పోటీ చేయబోయే స్థానంపై క్లారిటీ ఇచ్చారు. తన పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో.. పొత్తులో భాగంగా వచ్చిన 20 ఒక్క స్థానాలకు గాను ఇప్పటికే 15 నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లు ప్రకటించడం జరిగింది.ఈ నేపథ్యంలో పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్న విషయం పై వస్తున్న ప్రశ్నలకు నేడు సమాధానం దొరికింది పిఠాపురం లో కాపు సామాజికవర్గానికి చెందిన ఓటర్లు సంఖ్య ఎక్కువే. అయితే ఈ విషయం పవన్ కు ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి.












