పిఠాపురంలో పవన్ ప్రత్యేక పూజలు..
పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అక్కడ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈరోజు రెండవ రోజు పిఠాపురంలో పవన్ ప్రచారం కొనసాగింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం పిఠాపురంలోని దత్త పీఠాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అని తెలియడంతో దత్త పీఠం దగ్గర రద్దీ కూడా విపరీతంగా పెరిగింది. ఆ తర్వాత పిఠాపురంలో అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన పురుహూతిక శక్తి పీఠం లో పవన్ అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం పిఠాపురంలోని బషీర్ బీబీ దర్గాని కూడా పవన్ సందర్శించారు. ఆ తర్వాత జేజీఆర్ ఆసుపత్రిను ప్రారంభించిన పవన్.. ప్రజాబలం తమ వెంట ఉంది అని ధీమా వ్యక్తం చేశారు. ఈసారి పిఠాపురంలో ఎలాగైనా గెలవాలి అనే ఉద్దేశంతో పవన్ తన పావులు కదుపుతున్నారు.













