Rushikonda : రుషికొండ భవనాలను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్

వైసీపీ హయాంలో విశాఖ రుషికొండపై నిర్మించిన భవనాలను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పరిశీలించారు. ఆయన వెంట మంత్రులు నాదెండ్ల మనోహర్(Nadendla Manohar), కందుల దుర్గేశ్ (Kandula Durgesh ) ఉన్నారు. భవన సముదాయంలో నిర్మాణాలు, సదుపాయాలను పవన్ కల్యాణ్ పరిశీలించారు. సదుపాయాలకు గత ప్రభుత్వం వెచ్చించిన ఖర్చులను మంత్రులు ఆయనకు వివరించారు. భవనాల్లో అత్యాధునిక బెడ్‌రూమ్స్, బాత్‌రూమ్స్ చూసిన పవన్ ఆశ్చర్యపోయారు. పాడైపోతున్న వాటికి వెంటనే మరమ్మతులు చేయాలన్నారు. ఎన్జీటీ (NGT ) లో కేసు నడుస్తోందని అధికారులు ఆయనకు వివరించారు. పవన్ మీడియాతో మాట్లాడుతూ మొత్తం 7 బ్లాక్‌లకు 4 మాత్రమే పూర్తి చేశారు. వాటికోసం రూ.454 కోట్లు ఖర్చు పెట్టారు. గతంలో మమ్మల్ని రానివ్వకుండా ఎన్నో అడ్డంకులు స్పష్టించారు. హరిత రిసార్ట్స్ (Haritha Resorts ) ఉన్నప్పుడు ఏడాదికి రూ.7 కోట్ల ఆదాయం వచ్చేంది, ఇప్పుడు కేవలం కరెంటు బిల్లుకే రూ.15 లక్షలు అవుతోంది. ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. లోపల పెచ్చులు ఊడిపోతున్నాయి. కొన్నిచోట్ల లీకేజ్ అవుతోంది. జగన్ నివాసముండేందుకు ఈ భవనాలను కట్టారు. కానీ దీన్ని టూరిజం కింద ఎలా అభివృద్ధి చేయాలనేది ఆలోచిస్తున్నాం. ఈ నిర్మాణాన్ని ఎలా ఉపయోగించాలనే దానిపై ఆలోచన చేస్తున్నాం. రుషికొండ భవనాలపై అసెంబ్లీ వేదికగా చర్చ జరగాలి అని అన్నారు.