ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం కూడా వరదబాధితుడే అన్న విషయం మీకు తెలుసా?
ఆంధ్రప్రదేశ్లో కనివిని ఎరుగని రీతిలో ముంచెత్తిన వానలు.. వరదలు బీభత్సాన్ని సృష్టించాయి. వరద ఉధృతికి విజయవాడ బెంబేలెత్తిపోయింది. వర్షాలతో నదులు, వాగులు పొంగి పొర్లడంతో విజయవాడ పరిసర లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురి అయ్యాయి. ప్రభుత్వం సహాయం అందిస్తున్నప్పటికీ గత పది రోజులుగా ఇంకా ఎన్నో ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎందరో కూటమి నేతలు తమ వంతు సహాయాన్ని అందిస్తూ నిరంతరం ప్రజలకు అవసరమైన వస్తువులను సమకూరుస్తూ వరద ప్రాంతాలలో తిరుగుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తన వంతు బాధ్యతగా 6 కోట్ల రూపాయల నిధిని ఇరు తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు అందజేశారు. అయితే మనలో చాలామందికి తెలియని విషయమేమిటంటే వరద బాధితుల్లో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు.
అవునండి ఇది నిజమే.. ఎందుకంటే 2024 ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేయడం కోసం పవన్ కళ్యాణ్ తాను అక్కడే నివాసం ఉంటాను అంటూ స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు. పిఠాపురంలోని వై జంక్షన్ సమీపంలో 216 నేషనల్ హైవే పక్కన మూడున్నర ఎకరాల స్థలం కొనుక్కున్న పవన్ అందులోనే నివాసం ఉండడానికి ఇంటిని, పార్టీ ఆఫీస్ ని నిర్మించుకున్నారు. అయితే వరదల్లో పిఠాపురం నియోజకవర్గము కూడా తీవ్రంగా నష్టపోయింది. పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద ఉన్న ఏలేరు కాలవ పొంగిపొర్లడంతో ఇప్పుడు ఆ ప్రదేశం అంతా ఓ పెద్ద తటకాన్ని తలపిస్తోంది.
తాజాగా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన పవన్.. మోకాళ్లలోతు నీళ్లల్లో.. బురదలో.. నడుచుకుంటూ వరద ముంపు ప్రాంతాల ప్రజలను పరామర్శించారు. భారీ వరదల కారణంగా నష్టం పాలైన ప్రతి ఒక్కరికి సహాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. అతలాకుతలమైన విజయవాడ పరిస్థితిలను తిరిగి మామూలుకి తేవడానికి అందరూ తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు. వరద ప్రాంతాలలో కరెంటు దగ్గర నుంచి ఇంటి శుభ్రం వరకు.. రోడ్ క్లీనింగ్ దగ్గర నుంచి ఫుడ్ ఫెసిలిటీ వరకు అన్ని సమకూరుస్తూ ప్రభుత్వంప్రజలను ఆదుకుంటుంది.













