మరోసారి వారాహి యాత్రకు రెడీ అయిన పవన్.. ఎప్పుడంటే?
మరోసారి వారాహి విజయ యాత్ర చేయడానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెడీ అయ్యారు. నాలుగో విడత వారాహి యాత్రకు సంబంధించిన షెడ్యూల్ను జనసేన విడుదల చేసింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ యాత్ర ప్రారంభం అవుతుంది. ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డ మొదలై మచిలీపట్నం, పెడన, కైకలూరు మీదుగా ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. సోమవారం మధ్యాహ్నం ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన నేతలతో టెలీ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ సమావేశంలోనే వారాహి యాత్ర వివరాలను ఆయన వెల్లడించారు. ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి జనసేన పోటీ చేస్తుందని జనసేనాని పవన్ కల్యాణ్ ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాబట్టి ఈసారి వారాహి యాత్రలో టీడీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం ఉంది.













