నరేంద్ర మోదీ నాయకత్వంలో అది సాధ్యం : పవన్
ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్ త్వరలోనే స్వావలంబన కలిగిన దేశంగా అవతరించబోతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రధాని మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. ఈ ఏడాది కాలంలో దేశం ఎన్నో చారిత్రక, ఎన్నో సాహసోపేత నిర్ణయాలను చూసిందని పవన్ అన్నారు. త్వరలోనే భారత్ స్వావలంబన సాధించి తీరుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ 21వ శతాబ్ది భారత్‌దేనని చెప్పారు. ముందు చూపు, దైర్యసాహసాలు కలిగిన ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో అది సాధ్యం కానుందని పేర్కొన్నారు.













