పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ!
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోటీచేసే అసెంబ్లీ స్థానంపై స్పష్టత వచ్చింది. ఆయన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో బరిలోకి దిగనున్నారు. వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో ఆయన భీమవరం నుంచి పోటీ చేస్తారంటూ విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే పిఠాపురం నుంచే పోటీకి పవన్ మొగ్గుచూపినట్లు తెలిసింది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావలసి ఉంది. పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఓట్లు దాదాపు 91 వేలు ఉన్నాయి. ఇక్కడి నుంచి పోటీచేస్తే పవన్ భారీ విజయానికి ఢోకా ఉండదని జనసేన వర్గాల్లో బలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే పిఠాపురం నుంచి పోటీకి పవన్ మొగ్గుచూపినట్టు తెలుస్తోంది.













