జగన్ వర్గానికి కు ఊహించని షాక్…
‘ప్రత్యేక హోదా భరోసా’ పేరుతో ఏపీ కాంగ్రెస్ నిర్వహించిన సభకు అనూహ్యంగా పవన్ మద్దతు తెలపడం రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది. మొదట్నుంచి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్న పవన్.. ప్రత్యేక హోదా విషయంలో మాత్రం సపోర్ట్ ఇవ్వడం చర్చకు దారి తీసింది. అదే సమయంలో స్పెషల్ స్టేటస్ కోసం ఏ పార్టీతో అయినా కలిసి పని చేస్తామన్న వైసీపీ.. కాంగ్రెస్ నిర్వహించిన సభకు దూరంగా ఉంది. దీంతో జగన్ వర్గం ఇరుకునపడ్డట్టైంది.
పవన్ వైఖరితో ఏపీలో ప్రధానప్రతిపక్షం వైసీపీకి ఇబ్బందికరంగా మారింది. జగన్ ఇరకాటంలో పడినట్టైంది. జగన్ సరిగ్గా స్పదించకపోవడం తో వారి తీరు విమర్శలకు తావిస్తోంది. హోదా కోసం ఉద్యమించే ఎవరితోనైనా తాను కలుస్తానని పవన్ స్పష్టంగా చెప్పారు. ఆ మేరకు నడుచుకుంటున్నారు. జగన్ మాత్రం ఇప్పటికీ డైలమాలో ఉన్నట్లుగా కనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రత్యేక హోదా కోసం ఎవరితోనైనా కలుస్తామని జగన్ చెప్పడమే కానీ.. చేతల్లో కనిపించడం లేదంటున్నారు. హోదా కోసం కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహిస్తే కనీసం జగన్ స్పందించక పోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. మోడీ భయంతోనే జగన్ రెడ్డి స్పందించలేదు అని భావిస్తున్నారు.













