సీఎం పదవి విషయంలో మనసులో మాట చెప్పిన పవన్
సీఎం పదవి విషయంలో తన మనసులో ఏముందో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు. వారాహి యాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకర్గంలోని కత్తిపూడిలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబును సీఎం చేయడానికే పవన్ ఈ వారాహి యాత్ర చేస్తున్నాడని వస్తున్న విమర్శలను ఈ సందర్భంగా పవన్ ఖండించారు. తాను సీఎం పదవి కోరుకోవడంలేదంటూ వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని కూడా తప్పుబట్టారు. “ఎంతసేపూ నువ్వు విడిగా రా.. విడిగా రా అంటున్నారు. నేను విడిగా వస్తానో లేదంటే ఉమ్మడిగా ఎవరితోనైనా కలిసి వస్తానో ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఆ టైం వచ్చినప్పుడు ఈ విషయంలో కుండబద్దలు కొట్టేస్తా. కానీ ఒక్క విషయం.. వచ్చే ఎన్నికల్లో గెలిచి నేను అసెంబ్లీలో అడుగుపెట్టాలి. కచ్చితంగా పెడతాను. దాని కోసం ఎన్ని వ్యూహాలైనా అనుసరిస్తా. సీఎం పదవి ఇస్తే సంతోషంగా స్వీకరిస్తాం. ఆ పదవి మనకు రావాలంటే ఏం చేయాలి, ఎలా వెళ్లాలి అనే విషయంపై కూడా చర్చించుకుందాం” అని పవన్ తన మనసులో మాట బయటపెట్టారు.













