Pawan Kalyan: సినీ ఇండస్ట్రీ నుంచి అది మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు అంటున్న పవన్..

భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) విజయవంతంగా పూర్తవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు నెలకొన్నాయి. పహల్గాం (Pahalgam) ఉగ్రదాడికి కఠిన ప్రతిస్పందనగా భారత జవాన్లు (Indian soldiers) పాక్ ఉగ్రవాద (Pak Terrorists) శిబిరాలపై చురుకైన దాడులు జరిపారు. ఈ దాడులతో పాక్ ఉగ్రవాదులు తీవ్ర భయానికి గురయ్యారు. భారత శక్తిని చూపించేందుకు చేపట్టిన ఈ ఆపరేషన్ తర్వాత, దేశవ్యాప్తంగా దేశభక్తిని చాటుతూ బీజేపీ ‘తిరంగా యాత్ర’కు(Tiranga Yatra) పిలుపునిచ్చింది.
ఈ యాత్రకు విజయవాడలో మంచి స్పందన లభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu) , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి (Purandeswari) , ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు, సామాన్య ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ యాత్రలో పాల్గొన్నారు. దేశ భద్రత, జవాన్ల సేవల పట్ల ప్రజల్లో గౌరవాన్ని పెంపొందించేందుకు ఈ యాత్ర దోహదపడింది.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. భారత్ ఎదుగుదల చూసి తట్టుకోలేని పాకిస్తాన్ ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చి దాడులకు పాల్పడుతోందని విమర్శించారు. ముంబై, కోయంబత్తూరు, హైదరాబాద్‌లో జరిగిన పేలుళ్ల వెనుక కూడా పాక్ చేతివాటమే ఉందన్నారు. ఇప్పటివరకు మనం ఓర్పుగా ఉన్నామని, కానీ ఇకపై వారి దూకుడు తట్టుకోబోమని స్పష్టం చేశారు. భారత సైన్యం ఇప్పటి దాకా శాంతి మార్గాన నడిచిందని, అయితే ఇప్పుడు శత్రువులకు తగిన గుణపాఠం చెబుతోందని పవన్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో దేశంలో సూడో సెక్యులరిస్టులపై (pseudo secularists) పవన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సైన్యంపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం, వారిని కించపరచడం దేశద్రోహ చర్యలకే సమానమని అభిప్రాయపడ్డారు. అలాంటి వారి విమర్శలను సహించవద్దని, దేశభద్రత విషయంలో మౌనంగా ఉండకూడదని సూచించారు.
సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన పవన్ ఆపరేషన్ సింధూర విషయంలో సినీ వర్గాల మౌనం పై కూడా స్పందించారు. సినీ నటులు వినోదం అందించేవారని.. వారి నుంచి అంతకుమించి దేశభక్తి ఆశించడం మంచిది కాదని పవన్ అన్న వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ ఈ మాటలు వాళ్ళని సమర్ధించడానికి మాట్లాడారా లేక ఏదేవా చేయడానికి అన్నారా అన్న విషయంపై స్పష్టత లేదు. అంతేకాదు మురళి నాయక్ లా దేశం కోసం ప్రాణాలు అర్పించే వారే నిజమైన దేశభక్తులు అంటూ పవన్ తేల్చి చెప్పారు. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై సినీ ఇండస్ట్రీ ఏ రేంజ్ లో స్పందిస్తుందో వేచి చూడాలి.