అట్టహాసంగా జనసేన పార్టీ ఆవిర్భావ సభ ప్రారంభం
జనసేన పార్టీ ఆవిర్భావ సభ అట్టహాసంగా ప్రారంభమైంది. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సభను ఏర్పాటు చేశారు. కాసేపట్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సభ వేదిక వద్దకు రానున్నారు. ఈ సభకు జనసేన కార్యకర్తలతో పాటు పవన్ కల్యాణ్ అభిమానులు భారీగా పోటెత్తారు. జనసేన పార్టీ స్థాపించిన నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ఏర్పాటుచేసిన పూర్తిస్థాయి రాజకీయ సభ ఇదే కావడంతో ప్రాముఖ్యం సంతరించుకుంది. ప్రసుత్తం రాష్ట్ర రాజకీయాలు సున్నితంగా మారడంతో పవన్ ఈ సభలో ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తినెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు పట్టి భద్రత ఏర్పాటు చేశారు.













