వైసీపీ ఆరాచకాలకు ముగింపు : పవన్ కల్యాణ్
రాష్ట్రాన్ని నడిపించే ఐఏఎస్ అధికారులకు 20వ తేదీ వరకు జీతాలు చెల్లించకపోవడం దారుణమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐఏఎస్లకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. వేతనాలు రాక ఒప్పంద ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. కన్సాలిడేటెడ్ ఫండ్ ద్వారా ఐఏఎస్లకు జీతాలు వస్తాయి. ఐఏఎస్ల జీతాలు మళ్లించారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘనే. రాజ్యాంగ ఉల్లంఘన వైసీపీ నేతలకు సహజ గుణంగా మారింది. అసమర్థ ప్రభుత్వ పాలనతో సమస్యలు లేవనెత్తితే దాడులు చేస్తున్నారు. సమస్యలు లేవనెత్తినా ప్రభుత్వానికి జవాబుదారీతనం లేదు. కేసులు వాయిదా వేయించుకోవడానికి సీఎం జగన్, ఎంపీలు ఢిల్లీకి వెళ్తున్నారా? అని ప్రశ్నించారు. వైసీపీ అరాచకాలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉంది అని అన్నారు.
బీజేపీతో పొత్తు పోయిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారని అన్నారు. అయితే, పొత్తులపై ఎవరికీ చెప్పాల్సిన పని లేదని, ప్రజలకే చెబుతామని అన్నారు. ఎక్కడ పోటీ చేయాలనేది తమ స్వీయ నిర్ణయమని స్పష్టం చేశారు. జనసేన ఆరోపణలు చేయడం కాకుండా ఉద్యోగుల జీతాల కోసం ఢిల్లీకి వెళ్లాల్సిందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష, పసుపు బోర్డు కలను కేంద్ర ప్రభుత్వం సాకారం చేసింది. సీఎం జగన్ ఢల్లీి వెళ్లినా జీడీపప్పు, కొబ్బరి బోర్డుల కోసం కృషి చేయలేదు. పొత్తులు, సీట్లపై కంటే ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి బోర్డులు తీసుకురావడంపై దృష్టి పెట్టాల్సింది. సీబీఐ కేసులు వాయిదా వేయించుకోవడానికి ఢిల్లీ వెళ్తున్నారు. ఎన్డీయేతో పొత్తులోనే ఉన్నాం. ఎన్డీయే భేటీకి హాజరయ్యాం కూడా. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసే, బీజేపీ కలిసి వెళ్లాలి. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనేదే నా ఆకాంక్ష అని అన్నారు.













