తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చిన పవన్ కల్యాణ్ కుమార్తె

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమార్తె పొలెనా అంజన తిరుమల శ్రీవారిని దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. పొలెనా మైనర్ కావడంతో ఆమె తరపున తండ్రిగా పవన్ కూడా ఆయా పత్రాలపై సంతకాలు పెట్టారు.