కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే : పవన్ కల్యాణ్
జగన్ పాలన నుంచి ఏపీకి విముక్తి కల్పించాలన్నదే తమ బలమైన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండపేటలో నిర్వహించిన రోడ్ షోలో పవన్ మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తామని తెలిపారు. వ్యవసాయం చేసే రైతు నష్టాల్లో ఉన్నాడని, గంజాయి పండిరచే వైసీపీ నేతలు లాభాల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. ద్వారంపూడి కుటుంం దోచుకోవడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. దశాబ్దం నుంచి తనను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టాని, ప్రజా సంక్షేమం కోసం ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటానని తెలిపారు. పట్టాదారు పాస్‌పుస్తకాలపై ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి.
ప్రధానిగా మోదీ ఉన్నందున పాస్‌పోర్టుపై ఆయన ఫొటో లేదే? వైసీపీకు ఓటు వేస్తే ప్రజ ఆస్తులు గాలిలో దీపమే. మన ఆస్తి పత్రాలపై జగన్ హక్కు ఏంటని నిలదీయాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే గంజాయి గుండాలను ఉక్కు పాదంతో నలిపేస్తాం. వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తాం. వ్యవసాయ పరికరాలు సబ్సిడీపై అందిస్తాం. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేస్తాం. దళారుల దోపిడీ అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు చేపడతాం. సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. కేంద్రం నుంచి వచ్చే నిధులను పంచాయతీలకే కేటాయిస్తాం. ప్రతిపక్షం కూడా లేకుండా కూటమి పార్టీలను గెలిపించాలి అని కోరారు.













