6న పాదయాత్ర : పవన్ కల్యాణ్
ఢిల్లీలో అవిశ్వాసం ముందుకు రాకుండా కేంద్రం వ్యవహరించిన తీరుకు నిరసనగా ఈ నెల 6న నిరసన పాదయాత్ర చేయనున్నట్లు జనసేన అధినేత పవన్కళ్యాణ్ తెలిపారు. విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో సీపీఐ, సీపీఎం నేతలు రామకృష్ణ, మధులతో కలిసి పవన్ సుదీర్ఘంగా చర్చించిన తరువాత తమ ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడారు. ఈ నిరసన శాంతియుతంగా ఉంటుందని తెలిపారు. జాతీయరహదారుల మీదుగా పాదయాత్ర సాగుతుందని ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొంటానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ టూర్ అలస్యమయింది. గతంలోనే చేస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 15న అనంతపురం, ఒంగోలులో 24న, మే 6న విజయనగరంలో మేధావులతో సమావేశమవుతామని తెలిపారు. అంతకుముందు దళితులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఆమరణ దీక్షపై సమయం నాకు వదిలేయండన్నారు. జనం అనుకున్నది చెప్పానని, లంచాలు తీసుకుని రశీదులు ఇవ్వరుగా విలేకరులు అడిగినో ప్రశ్నకు సమాధానమిచ్చారు.













