జేపీ నడ్డాతో పవన్ కల్యాణ్ భేటీ
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ నడ్డాను కలిశారు. వీరిద్దరి భేటీ సుమారు గంటకు పైగా కొనసాగింది. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిస్థితులు, బీజేపీ రాష్ట్ర సారథి మార్పు తర్వాతి పరిణామాలు, ఎన్నికలకు సమాయత్తం తదితర అంశాలపై నడ్డా, పవన్ చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులను కూడా నడ్డా దృష్టికి పవన్ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. పవన్ వెంట జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉన్నారు.













