చంద్రబాబు, పవన్ భేటీలో పలు అంశాలపై చర్చ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఉద్ధానం, పోలవరం, అమరావతి, రైతులకు నష్టపరిహారం అంశాలే కాకుండా రాష్ట్రంలో, కేంద్రంలో తాజా రాజకీయ పరినామాలపై కూడా వీరిరువురి మధ్యా చర్చ జరిగినట్లు తెలిసింది. ఉద్దానంలో కిడ్నీ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉందని, వ్యాధి గ్రస్తులకు ఉపశమనం కలిగించే అనేక చర్యలు ప్రభుత్వం తీసుకుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి పవన్ చొరవ తీసుకోవడం ముదావహమన్నారు.













