అన్న కోసం పవన్ స్కెచ్.. ఈసారి వర్క్ అవుట్ అవుతుందా..
ఆఖరి నిమిషంలో అభ్యర్థుల మార్పుల చేర్పులతో జనసేనాని బాగా బిజీగా ఉన్నాడని టాక్.జనసేన తరఫున ఇప్పటికే 18 మంది అసెంబ్లీ అభ్యర్థులను ఒక ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగిలిన సీట్లపై కూడా తర్జనభర్జనలు జరుగుతున్నాయి. పెండింగ్ లో ఉన్న మచిలీపట్నం స్థానం నుంచి తన అన్న నాగబాబుని పోటీ చేయించాలి అని పవన్ భావిస్తున్నట్లు టాక్. మచిలీపట్నం నుంచి బాలశౌరి ఎంపీ స్థానానికి పోటీ చేస్తారు అన్న ప్రచారం మొదటినుంచి జరుగుతోంది. వైసీపీ గూటిని వీడి జనసేన తీర్థం పుచ్చుకున్న బాలశౌరి కి టికెట్ కన్ఫామ్ అని అందరూ భావించారు. అయితే ఆఖరి నిమిషంలో ఈ లెక్కలు మారబోతున్నాయి అని సమాచారం. బాలశౌరి ను అవనిగడ్డ నుంచి బరిలోకి దింపుతారు అన్న ప్రచారం జరుగుతోంది. అభ్యర్థులకు సంబంధించిన తాజా మార్పులను మరొక రెండు రోజులలో పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.












