జై తెలంగాణ అంటేనే తెలంగాణ వచ్చింది.. ఆంధ్రా వాళ్లకి ఏదీ మనది అనిపించదా? : పవన్
విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యపై వైసీపీ ప్రభుత్వం వారంలోగా స్పందించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవాలంటే అఖిలపక్షం ఏర్పాటు చేయాలన్నారు.. ప్రభుత్వానికి వారం గడువు ఇస్తున్నామని అన్నారు. చట్టసభల్లో మాట్లాడాల్సిన నేతలు మౌనంగా ఉంటే ఏం లాభం అని మడిపడ్డారు. వైసీపీ మాటలకు అర్థాలు వేరులే. చెప్పినమాటకు తూట్లు పొడవటమే వైసీపీ అధినేత సంకల్పం అన్నారు. వైసీపీ మాటాలన్నీ ఆచరణలోకి రాని మాటలు. జై తెలంగాణ అంటేనే తెలంగాణ వచ్చింది. ఆంధ్రా వాళ్లకి ఏది మనది అనిపించదా? స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతామని వైసీపీ ప్రభుత్వం ప్రకటించాలని అన్నారు.
సమస్యను చూసి తాను పారిపోయే వ్యక్తికి కాదన్నారు. ముందడుగు వేయటమే తెలుసు కాని, వెనకడుగు తెలియదన్నారు. విభజన సమయంలో రాష్ట్ర ప్రజలకు క్యాబీజీ పూలు పెట్టారన్నారు. ఇంకా మీ కాకమ్మ కథలు చెప్పద్దన్నారు. విభజన సమయం నాటి రాజకీయాలను వైసీపీ చేస్తున్నదని ఆరోపించారు. తమ మాట మోడి వినటం లేదని వైసీపీ ఎంపీలు తప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులిచ్చి ఓట్లు వేయించుకున్నవాళ్లు వైసీపీ నేతలని ఆయన దుయ్యబట్టారు. కాంట్రాక్టులు, పదవులు మాత్రమే ఎంపీలకు ముఖ్యమని ఆరోపించారు.













