జనసేన వస్తే వారిని గుండెల్లో పెట్టుకుంటాం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ పట్నంలో దివ్యాంగులతో ముచ్చటించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్ మాట్లాడుతూ జనవాణి కార్యక్రమంలో దివ్యాంగుల సమస్యలపై చర్చిస్తాం. వారిని ఉన్నతమైన పరిపక్వతతో చూడాలి. దివ్యాంగుల చట్టం అమలు కావడం లేదు. వారిని ఇబ్బంది పెడితే శిక్షించే చట్టం రావాలి. రాష్ట్ర ప్రభుత్వం రూ.3 వేలు ఇచ్చి సరిపెడుతుంది. జనసేన వస్తే వారిని గుండెల్లో పెట్టుకుంటాం. ఎన్డీయే భేటీకి వెళ్లినప్పుడు ప్రధాని మోదీతో మాట్లాడి న్యాయం చేస్తా. ఉపాధి కల్పించడంతో పాటు రుణాలు ఇచ్చి ఆదుకుంటాం అని అన్నారు.













