Pawan Kalyan: సినిమా ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్ ప్రకంపనలు..!?
ఆంధ్రప్రదేశ్ తో (Andhra Pradesh) పాటు దేశవ్యాప్తంగా ఇప్పడు తిరుమల లడ్డూ (Tirumala Laddu) వివాదం కొనసాగుతోంది. తిరుమల ప్రసాదాల (Tirumala Prasadams) తయారీకి వాడిన నెయ్యి కల్తీ (adulterated ghee) జరిగిందని.. అందులో జంతు కొవ్వు (animal fat) కలిసిందని సాక్షాత్తూ సీఎం చంద్రబాబు (CM Chandrababu) చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ అంశంపై విచారణ చేపట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ మొదలైంది. ఈ నేపథ్యంలో పాపపరిహారం కోసం పలువురు పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. అదే సమయంలో సినిమా ఇండస్ట్రీలో (Cinema Industry) లడ్డుపై కామెంట్స్ చేసిన పలువురికి ఆయన గట్టిగా సమాధానం చెప్పారు.
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలకలం ఇప్పట్లో చల్లారేలా లేదు. వైసీపీ (YCP) అధికారంలో ఉండగా టెండర్ దక్కించుకున్న తమిళనాడుకు (Tamilnadu) చెందిన ఏఆర్ ఫుడ్స్ (AR Foods) సరఫరా చేసిన నెయ్యిలో జంతుకొవ్వు కలిసినట్లు తేలిందని టీటీడీ (TTD) వెల్లడించింది. దీంతో ఈ దుర్మర్గానికి పాల్పడిన నాటి పాలకులు, పాలకమండలిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వస్తుంది. దీనిపై ప్రభుత్వం విచారణకు (Enquiry) ఆదేశించింది. అదే సమయంలో నాడు పాలకులు చేసిన తప్పును సరిదిద్దుకోవడంలో భాగంగా ప్రభుత్వం ఆలయ సంప్రోక్షణ చేపట్టింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష పూనారు.
తిరుమల లడ్డూ వ్యవహారంపై సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. దీనిపై విచారణ జరపాలని.. అలాంటి పాపపు పనులు చేసిన వారిని ఆ శ్రీనివాసుడు శిక్షిస్తాడని మోహన్ బాబు (Manchu Mohan Babu) అభిప్రాయపడ్డారు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj).. ఎక్స్ లో పవన్ కల్యాణ్ ను ట్యాగ్ చేస్తూ దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఇది జాతీయ సమస్య అన్నట్టు రాద్ధాంతం చేయవద్దని సూచించారు. మరోవైపు ఓ సినిమా ప్రమోషన్లో పాల్గొన్న హీరో కార్తీ (Karthi).. లడ్డూ పేరెత్తొద్దని.. ఇప్పుడది సెన్సిటివ్ ఇష్యూ (sensitive issue) అని అభిప్రాయపడ్డారు.
ఈ కామెంట్స్ పై పవన్ కల్యాణ్ సీరియస్ గా స్పందించారు. ప్రకాశ్ రాజ్ అంటే తనకు గౌరవం ఉందని.. అయితే హిందువుల (Hindus) మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడొద్దని సూచించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సెక్యులరిజం (secularism) గురించి మాట్లాడేవాళ్లంతా ఆచితూచి మాట్లాడాలన్నారు. మరోవైపు కార్తీ సెన్సిటివ్ కామెంట్స్ పైన కూడా పవన్ కల్యాణ్ రియాక్ట్ అయ్యారు. ఇది సెన్సిటివ్ సమస్య కాదని.. మీరు మాట్లాడాలనుకుంటే మద్దతుగా మాట్లాడాలని.. లేదంటే మౌనంగా ఉండాలని సూచించారు. అంతేకాని హేళన చేసేలా మాట్లాడడం సరికాదని సూచించారు. దీనిపై స్పందించిన కార్తీ క్షమాపణ చెప్పారు.
పవన్ కల్యాణ్ దెబ్బకు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తం తిరుమల లడ్డూ వ్యవహారంపై స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది కూడా అనుకూలంగా..! సహజంగా పవన్ కల్యాణ్ ఇండస్ట్రీలో ఎవరేం అనుకున్నా పెద్దగా పట్టించుకోరు. కానీ ఇప్పుడు సనాతన ధర్మంపై దాడి జరుగుతోందని.. ఇలాంటి వాటిపై మౌనంగా ఉండడం కరెక్ట్ కాదని ఆయన చెప్తున్నారు. ఈ అంశంపై మాట్లాడుతున్నప్పుడు ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. దీంతో చాలా మంది ఇప్పుడు పవన్ కల్యాణ్ కు మద్దతుగా నిలుస్తున్నారు.













