జగన్ పై విమర్శల ఆస్త్రాలు సంధించిన పవన్..
ఈరోజు చిలకలూరిపేట లోని బొప్పిడి వేదికగా టీడీపీ, బీజేపీ, జనసేన అధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగళం సభకు అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు.ఈ సభలో జనసేనాధినేత పవన్ కళ్యాణ్ జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో జగన్ ఒకసారి వ్యాపారి అని వ్యాఖ్యానించిన పవన్.. ఈ ఐదేళ్లలో లక్షా 20 వేల కోట్ల వ్యాపారం జరిగితే, 84 వేల కోట్లు మాత్రమే లెక్కల్లో చూపిస్తున్నారని.. పన్ను ఎగవేసి సొమ్ము దాచుకున్నాడని ఆరోపించారు. అందిన ప్రతి విషయంలో దోచుకోవడం తప్ప..ఈ ప్రభుత్వానికి మరేమీ చేతకాదని ఎద్దేవా చేశారు. సొంత బాబాయిని చంపుకున్న ప్రభుత్వమని పవన్ విమర్శించారు. జగన్ తనని తాను రావణాసురుడిగా భావిస్తున్నాడని.. బంగారు కోట చుట్టూ ఉంది కాబట్టి ఏమీ కాదని విర్రవీగుతున్నాడని పవన్ అన్నారు. అంతటి రాక్షసుడిని కూడా శ్రీరాముని బాణం తుదముట్టించిందని గుర్తు చేశారు. పనిగట్టుకుని మరీ ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలను జగన్ ప్రభుత్వం పెట్టిందని.. వీళ్ళ పాలనలో రాష్ట్రం రావణకాష్టంగా మారిందని ఆయన అన్నారు. అప్పుల లోన అలిగిపోతున్న ఏపీని అభివృద్ధి వైపు నడిపించాలంటే జగన్ ప్రభుత్వం అంతమొందాలని పవన్ పిలుపునిచ్చారు.













