శ్రీకాళహస్తి సీఐపై ఎస్పీకి పవన్ ఫిర్యాదు
శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్‌పై తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫిర్యాదు చేశారు. తొలుత గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంట చేరుకున్న పవన్ అక్కడి నుంచి తిరుపతికి వచ్చారు. జనసేన కార్యకర్తలతో కలిసి భారీగా ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని అక్కడ వినతిపత్రం అందజేశారు. ఇటీవల శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడు కొట్టే సాయి పై సీఐ అంజూయాదవ్ చేయిచేసుకున్నారు. దీన్ని జనసైనికులు తీవ్రంగా ఖండిరచారు. ఈ క్రమంలోనే పవన్ తిరుపతి చేరుకుని జిల్లా ఎస్పీని కలిసి సీఐపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో జనసైనికులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే సీఐ చేయిచేసుకున్నారని అన్నారు. ఈ ఘటనపై సుమోటోగా కేసు తీసుకున్నందుకు హెచ్ఆర్సీకీ దన్యవాదాలు. మచిలీపట్నం సభలో ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగలేదు. శ్రీకాళహస్తిలో సీఐ వ్యవరించిన తీరుపై ఎస్పీకి ఫిర్యాదు చేశాం అని తెలిపారు.













