ఐఏఎస్ కృష్ణతేజ సేవలు అభినందనీయం : డిప్యూటీ సీఎం పవన్
తెలుగు ఐఏఎస్ కృష్ణతేజకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారానికి ఆయన ఎంపిక కావడం హర్షణీయమని తెలిపారు. మరిన్ని సేవలందిస్తూ ఉద్యోగులు, యువతకు స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కృష్ణతేజ త్రిస్సూర్ కలెక్టర్గా పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు ఆయన ఉత్తమ విధానాలు అనుసరించారని గుర్తు చేశారు. కరోనా, కేరళ వరదల విపత్తుల సమయంలో ఆయన అందించిన సేవలను ప్రజలు మరిచిపోలేదని పవన్ తెలిపారు. తెలుగుతేజం, ఐఏఎస్ అధికారి ఎం.వి.ఆర్.కృష్ణతేజకు జాతీయ పురస్కారం లభించింది.













