Game Changer: అబ్బాయి కోసం రానున్న బాబాయి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan) హీరోగా శంకర్(Shankar) దర్శకత్వంలో రూపొందిన గేమ్ ఛేంజర్(game changer) సినిమా జనవరి 10న సంక్రాంతికి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ తో పాటూ సాధారణ సినిమా లవర్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. డల్లాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ప్రమోషన్స్ ను మొదలుపెట్టనుంది చిత్ర యూనిట్.
డల్లాస్ లో కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా గేమ్ ఛేంజర్ కు సంబంధించిన మరో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని మేకర్స్ చూస్తున్నారు. ఈ ఈవెంట్ ను కూడా ఏపీలోనే చేయాలని మేకర్స డిసైడయ్యాడట. అంతేకాదు ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్, చరణ్ కు బాబాయి అయిన పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ను ఈ వేడుకకు గెస్టుగా తీసుకురానున్నారట.
చరణ్, పవన్ మధ్య ఉన్న బాండింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఒకే స్టేజ్ పై కనిపించబోతున్నారనే వార్త మెగా ఫ్యాన్స్ లో ఆనందాన్ని నింపుతోంది. ముఖ్యంగా పవన్ పాలిటిక్స్ లో బిజీ అయ్యాక సినీ ఈవెంట్లకు వచ్చింది లేదు. దీంతో ఈ ఈవెంట్ చాలా బాగా జరగాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. జనవరి 4న ఈ సినిమా ఈవెంట్ రాజమండ్రిలో ఉండే అవకాశముంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.













