పవన్ కల్యాణ్ యూ టర్న్ ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ యూటర్న్ తీసుకున్నారా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. తాజాగా ఓ జాతీయ చానెల్‌ను ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన పవన్, ప్రత్యేక హోదా పెద్ద విషయం కాదంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. ప్రత్యేక హోదా అనేది ముఖ్యమైనది కాదని, ఏపీకి హోదా వచ్చినా, రాకపోయినా, రాష్ట్రానికి కావాల్సింది ఆర్థిక సాయం అని చెప్పారు. తమ డిమాండ్లు నెరవేరేంత వరకు బీజేపీతో కలిసే ప్రసక్తే లేదని సృష్టం చేశారు. బీజేపీని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు జిల్లాలు చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయని, వీటికి కేంద్రం నుంచి మరిన్ని నిధులు కావాలని డిమాండ్ చేశారు.













