తెనాలి జనసేన అభ్యర్థిని ప్రకటించిన పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న శాసనసభ ఎన్నికలకు జనసేన తరపున తొలి అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ పేరును ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. తెనాలి నుంచి పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తారని ఆ నియోజకవర్గ నేతలతో జరిగిన ఆత్మీయ సమావేశంలో ప్రకటించారు. తెనాలిలో జనసెన జెండా కచ్చితంగా ఎగురుతుందని పవన్ కల్యాణ్ విశ్వాసాన్ని వెలిబుచ్చారు. గతంలో తెనాలి నుంచి శాసనసభ్యుడిగా ఆ నియోజకవర్గానికి ఎంతో సేవ చేసిన మనోహర్‌ను ఈసారి గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజలెదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి నాదెండ్ల మనోహర్ లాంటి నేతలు అంసెబ్లీకి పంపించాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.













