Pawan Kalian :భక్తులను ఒకేసారి క్యూలైన్లలోకి ఎందుకు వదిలారు? : పవన్
వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalian) తిరుపతి చేరుకున్నారు. బైరాగిపట్టెడలోని పద్మావతి పార్క్ (Padmavati Park )ను చేరుకున్న డిప్యూటీ సీఎం. తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును జేసీ శుభం బన్సల్(Shubham Bansal), డీఎస్పీ చెంచుబాబు(Chenchu Babu) పవన్‌కు వివరించారు. భక్తులను ఎందుకు ఒకేసారి క్యూలైన్లలోకి వదలాల్సి వచ్చిందని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. హైవేకు దగ్గరగా ఉండటంతో భక్తులు పెద్ద ఎత్తున పద్మావతి పార్క్‌కు వచ్చారని అధికారులు వివరించారు.













