Pawan Kalian :మినీ గోకులాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
పిఠాపురం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan kalian )పర్యటించారు. ఇందులో భాగంగా పిఠాపురం(Pithapuram) మండలం కుమారపురంలో కృష్ణుడి ఆలయం వద్ద నిర్మించిన మినీ గోకులం (Mini Gokulam )తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 12,500 మినీ గోకులం షెడ్లను ఇక్కడి నుంచి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తుంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్(Uday Srinivas), కలెక్టర్ షాన్మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.













