తెలుగింటి ఆడపడుచులకు సోషల్ మీడియాలో సరికొత్త హామీ ఇచ్చిన పవన్..
ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మహిళలకు శుభాకాంక్షలు తెలియపరిచారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర మహిళలకు ఆయన ఓ ప్రత్యేక హామీని ఇవ్వడం విశేషం. మహిళల రక్షణ సంక్షేమం తమ బాధ్యతగా తీసుకుంటాం అంటూ పవన్ భరోసా ఇచ్చారు. కేవలం అక్కాచెల్లెళ్లు అని మాటలతో సరిపెట్టబోమని.. వారు విద్యా ,ఉద్యోగాలలో రాణించే విధంగా వృత్తి, నైపుణ్యాలను పెంపొందిస్తామని ఈ నేపథ్యంలో ఆయన హామీ ఇచ్చారు. అంతేకాదు ఏ సంస్కృతి ఏ జాతి ఏ సమాజం స్త్రీకి సమున్నతి స్థానం ఇస్తుందో అక్కడ అభివృద్ధి ముందంజలో ఉంటుంది అని పవన్ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పవన్ పెట్టిన ఈ పోస్ట్ బాగా వైరల్ అయింది.













