పిఠాపురంలో పవన్ గ్లాస్ కి ఆపోజిట్ గా పవన్ బకెట్..
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాను అని అనౌన్స్ చేసినప్పటి నుంచి అక్కడ రాజకీయాలు విపరీతంగా వేడెక్కాయి. పవన్ కళ్యాణ్ గాజు గ్లాస్ ని పోలిన బకెట్ గుర్తుతో పిఠాపురం నుంచి కే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పోటీ చేస్తున్నారు. ఇది జనసైనికులలో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఓటు వేసే సమయంలో గుర్తుల విషయంలో కన్ఫ్యూజ్ అయినా పేర్లను పట్టి గమనించొచ్చు అన్న ధీమా ఉంటుంది. అయితే ఇక్కడ అది కూడా లేదు. అపోనేంట్ పేరు కూడా కే.పవన్ కళ్యాణ్. ఇప్పటికే తమ ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ ని ఎన్నికల సంఘం ప్రీ సింబల్ గా చేసింది అన్న వార్తలు అల్లకల్లోలం సృష్టిస్తుంటే ఇప్పుడు జనసైనికులకు ఇదొక కొత్త తలనొప్పిగా మారుతుంది. నవరంగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురం అభ్యర్థిగా కే.పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని బకెట్ సింబల్ తో దించింది. ఓట్లు వేసే వాళ్లు ఏమాత్రం కన్ఫ్యూజ్ అయినా ఇక జనసేనాని పరిస్థితి అంతే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.













