శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు
తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు శాస్త్రోకంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ హోమాలు తదితర వైధిక కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సంపంగి ప్రాకారంలో వేడుకగాన్నే తిరుమజనం నిర్వహించారు. ఇందులో పాటు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంద ద్రవ్యాలతో వివేషంగా అభిషేకం చేశారు. అమ్మవార్లకు విశేష సమర్పణ చేశారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్, చిన్నజీయర్ స్వామి, అదనపు ఈవో ఏవి.ధర్మారెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో రమేష్ బాబు, పేష్కార్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.













