నరేంద్ర మోడీ కిట్లను పంపిణీ చేసిన పాతూరి నాగభూషణం
భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు పేద ప్రజలు “లాక్ డౌన్” సమయంలో ఆకలితో బాధపడకుండా ఆహారం అందించాలి అనే సంకల్పంతో వారి సూచనల మేరకు మాజీ కేంద్ర మంత్రివర్యులు ఎంపీ వై సుజనా చౌదరి గారి సహకారంతో ఆంధ్ర రాష్ట్రంలో పలు సేవా కార్యక్రమాలు భాగంగా బీజేపీ నేత పాతూరి నాగభూషణం గారు వారి అనుచరులు కృష్ణాజిల్లా విజయవాడలోని పడమట శ్రీ రాజరాజేశ్వరి ఆలయ ప్రాంగణం లో గల కళ్యాణమండపం నందు బీజేపీ నేత విజయవాడ పార్లమెంట్ ఇంచార్జి శ్రీ సత్య మూర్తి గారి సూచనల మేరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతంశెట్టి నాగేశ్వరావు గారి ఆధ్వర్యంలో బీజేపీ నేత మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ పాతూరి నాగభూషణం గారు లాక్ డౌన్ సమయంలో జీవనోపాధి కోల్పోయిన పేద ఆటో కార్మికులకు నిత్యావసర సరుకుల తో కూడిన “నరేంద్ర మోడీ” కిట్లను అందజేశారు. కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు పాల్గొని సేవా కార్యక్రమంలో తమ సేవలు అందించారు.













