ఒక్క తెలంగాణ మాత్రమే కాదు.. అన్ని రాష్ట్రాలు ఏపీతోనే
ఆంధ్రప్రదేశ్ విధ్వసం, తెలంగాణ అభివృద్ధి అనేది జగన్, కేసీఆర్‌ల ఉమ్మడి అజెండా అని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. క్రెడాయ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ ఆంధ్రప్రదేశ్‌ని ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలపై ప్రత్తిపాటి స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న వాస్తవ పరిస్థితులనే కేటీఆర్ చెప్పారని అన్నారు. ఒకప్పుడు ఏపీలో ఉన్న భూముల ధరలు ప్రస్తుతం 200 శాతం పడిపోతే, తెలంగాణలో గణనీయంగా పెరిగాయని పేర్కొన్నారు. క్షీణించిన శాంతి భద్రతలు, జరగని అభివృద్ధి, పరిశ్రమలు మూతపడటంతో తెలంగాణ సురక్షితమని అంతా భావిస్తున్నారని తెలిపారు. ఒక్క తెలంగాణ మాత్రమే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాలు తమ గొప్ప చాటేందుకు ఏపీలోనే పోల్చుకుంటున్నాయని దుయ్యబట్టారు. జగన్ అసమర్థతే కారణమని మండిపడ్డారు.













