ఆ గెలుపు సీఎం కష్టానికి నిదర్శనం
కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం ముఖ్యమంత్రి చంద్రబాబు మూడేళ్ల కష్టానికి ఒక నిదర్శనమని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. నంద్యాల ఓటమి తర్వాత పునరాలోచనలో పడిన వైకాపా నేతలకు కాకినాడలో కూడా ఓటమి తప్పదని, అందుకే ఆ పార్టీ నేతలు ఓటమికి కారణాలు వెతుక్కొనే పనిలోపడ్డారని ఆరోపించారు. కాకినాడ పురపాలక ఎన్నికల్లో వైకాపాకు సింగిల్ డిజిట్ ఫలితమే రాబోతుందని జోస్యం చెప్పారు. 20 ఏళ్ల తర్వాత కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేయబోతున్నామన్నారు. నిన్న జరిగిన కాకినాడ పురపాలక ఎన్నికల్లో తమ పార్టీకి 38 స్థానాలు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.













