ఆయన్ను పట్టుకోలేని వారికి చలో మాచర్లను.. అడ్డుకునే హక్కు ఎక్కడిది?
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారీ పోలీసుల అసమర్థతకు నిదర్శమని తెలుగుదేశం పార్టీ నేత ప్రతిపాటి పుల్లారావు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నిందితులకే పోలీసులు పహారా కాస్తారని మరోసారి నిరూపించారన్నారు. వివేకా హత్య కేసు నిందితుడు అవినాస్ను ఇలానే దగ్గరుండి కాపాడారని ఆరోపించారు. ఈసీ ఆదేశించినా అరెస్టు చేయకుండా ఎవరి కళ్లకు గంతలు కడుతున్నారు? జరుగుతున్న పరిణామాలు చూస్తూంటే పిన్నెల్లిని పోలీసులే విహారయాత్రకు పంపినట్లయింది. ఆయన్ను ఏపీ పోలీసులు అరెస్టు చేయరు. డీజీపీ, పోలీసులు వైసీపీ ఆదేశాల మేరకు పనిచేస్తున్నారు. ఈసీ ఇకనైనా వారి నిజస్వరూపం తెలుసుకోవాలి. సీబీఐని రంగంలోకి దించాలి. పిన్నెల్లిని పట్టుకోలేని వారికి చలో మాచర్లను అడ్డుకునే హక్కు ఎక్కడిది? ఆయన్ను తపిపంచడంలో మొదట్నుంచీ అధికారుల పాత్ర సుస్పష్టం అని ఆరోపించారు.













